దోమకొండ లో ప్రారంభమైన జిల్లా స్థాయి అర్చరి పోటీలు..!

దోమకొండ లో ప్రారంభమైన జిల్లా స్థాయి అర్చరి పోటీలు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక గడికోటలో జిల్లా స్థాయి ఆర్సరీ పోటీలను ఎస్సై స్రవంతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, అర్చరి జఎల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్ లు బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులకు కరచాలనం చేసి అనంతరం ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఆర్చరీలో గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, రాష్ట్రస్థాయి నుండి, జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు పోటీలో నిలుస్తున్న క్రీడాకారులను అభినందించారు. అండర్ 14, అండర్ 17 విభాగంలో శ్రీకాంత్, రేహాన్, రామ్ చరణ్, బాలికల విభాగంలో ప్రీతి, శ్రీవర్షణ, సహస్ర, అండర్ టెన్ విభాగంలో, రాజేందర్, దీక్షిత, రిత్విక్, స్నేహిత్, అండర్ 17 విభాగంలో ఇందు, సుమంత్, కాంపౌండ్ విభాగంలో కృష్ణ, సాయి, ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి క్రీడాల్లో క్రీడాకారులు రాష్ట్రస్థాయికి హార్వత సాధించడంపై అభినందించారు. ఈ పోటీలకు సహకరించిన కామినేని, కోచ్ ప్రతాప్ దాసులను అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!