
నేడే తొలి రాష్ట్రపతి జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 25,(అఖండ భూమి న్యూస్);
అధికారమంటే సేవ చేయడమే కానీ ఆధిపత్యం ప్రదర్శించడం కాదు. భారత తొలి రాష్ట్రపతి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అయిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జన్మదినం. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఆయన పేరు స్వచ్ఛత, సేవాభావం వినయానికి ప్రాతికగా నిలుస్తుంది. 1884లో బీహార్ లో జన్మించి న రాజేంద్రప్రసాద్ విద్యావంతుడు,న్యాయవాది,ఆలోచన పరుడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ నుంచి పిలుపు అందుకున్న క్షణం నుండి ఆయన జీవిత దశ మారిపోయింది. చంపారన్సత్యాగ్రహం,సహాయనిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమా ల్లో పాల్గొని విశిష్ట సేవలు అందించారు. భారత రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత 1950 సంవత్సరంలో దేశపు తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నప్పటికి గాందేయ విలువలను ఆచరణలో కొనసాగించారు. సరళ జీవనం పారదర్శక వైఖరి దేశసేవ పట్ల అంకితభావం ఆయన వ్యక్తిత్వానికి మూల సూత్రాలు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా సేవ లు అందించి ప్రజల మన్ననలను పొందిన అరుదైన నాయకుడు. 1954లో ఆయనకు భారతదేశ అత్యున్నత గౌరవం భారతరత్న ప్రధానం చేయబడింది. ఆయన చూపిన నిజాయితీ,నిస్వార్థసేవ మార్గం నేటి ప్రజా ప్రతినిధులకు మార్గ దర్శకంగా నిలుస్తుంది. రాజేంద్రప్రసాద్ జీవితం మన నేర్పే విషయం ఒకటి. అధికారమంటే సేవ చేయడమే”, ఆధిపత్యం ప్రదర్శించడం కాదు. ఈ దేశం ఆయన చేసినసేవలకు ఎప్పుడు రుణపడి ఉంటుంది.ఘనంగా నివాళులు కూడా ఇస్తుంది.


