*అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి …
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 26 (అఖండ భూమి న్యూస్);
అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయి రైతుల కష్టార్జిత పంట నష్టపోతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు తమ రక్తం చెమటతో పండించిన వరి పంటను ఐకెపి కేంద్రాలకు తరలించి రాసులుగా వేసారని, పట్టాలు కప్పినప్పటికీ భారీ వర్షాలతో గాలులు వీచి పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని తెలిపారు. ఐకెపి కేంద్రాలలో సరైన వసతులు, భూమి సదుపాయాలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరస్కరించడం అన్యాయం. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. మెచ్యూర్ పేరుతో వారాల తరబడి రైతులను కేంద్రాల్లో వేధించడం సరికాదు,” అని అన్నారు.
తేమ శాతాన్ని పెంచి తడిసిన ధాన్యాన్ని సడలింపుతో కొనుగోలు చేయాలని, రైతులకు కనీసం పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“రైతులు తమ జీవితాధారం అయిన పంటను రక్షించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులు నిరసనలకు దిగే పరిస్థితి వస్తుంది,” అని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్ ,మోతి రామ్ నాయక్, కొత్త నరసింహులు, ముధం అరుణ్ కుమార్, దొడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


