జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీ మధ్యే పోటీ…

*జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీ మధ్యే పోటీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 28 (అఖండ భూమి న్యూస్);

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఈ రోజు(సోమవారం) స్టేట్ ఆఫీస్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని రామ్‌చందర్ రావు నేతృత్వంలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ క్యాడర్‌ను ప్రచారంలోకి దింపాలని సమావేశంలో బీజేపీ నిర్జయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్ రెడ్డి వరుసగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు మాట్లాడారు.. జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యే పోటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు. మజ్లిస్‌ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028 జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!