వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 28 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సదా శివనగర్ మండల కేంద్రం, రాంరెడ్డి మండలం లోని ఉప్పల్ వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు తుపాను ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ఆన్ని వరి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను చేయాలనీ, రైతులు నష్టపోకుండా, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు.
రానున్న రోజుల్లో వర్షా ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కాగా, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని ఆన్నారు.
కేంద్రాల వద్ద వడ్ల కాంటాలను పరిశీలించి, వాతావరణం బాగలేనందున కాంట వేసిన బస్తాలు సంరక్షించుకోవాలని సెంటర్ ఇంఛార్జీకి , సంఘ కార్యదర్శికి సూచించారు కొనుగోలు కేంద్రాలను రైతుల తమ పంటను తీసుకోవచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం ,తదితర పాటించాలని , వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వడ్ల కుప్పలు వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రైస్ మిల్లు వద్ద వడ్ల సంచులు దించుకున్న వెంటనే, రిసిప్ట్ పొంది వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయవలసిందిగా సెంటర్ ఇంఛార్జీకి సూచించారు.
జిల్లాలో మొత్తం 427 కేంద్రాలు, 233 ఫాక్స్ కేంద్రాలు, 193 ఐకెపి, గ్రేడ్ ఎ రకం రూపాయల క్వింటాలుకు 2389, సాధారణ రకం క్వింటాలుకు 2369
కలెక్టర్ వెంట డిప్యూటి కలెక్టర్ రవితేజ, dro మదన్ మోహన్ DCO రామ్మోహన్ క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్ , DM, DCSO (CS) AO, AEO సంఘ కార్యదర్శులు, సెంటర్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


