నవంబర్ 11 న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి…

నవంబర్ 11 న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి…

*కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 28 (అఖండ భూమి న్యూస్);

  • కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని నసూర్లబాద్ మండల కేంద్రము లో కల్లు గీత కార్మిక సంఘం మహాసభల కరపత్రాలు మంగళవారం ఆవిష్కరణ చేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ. కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 68 సంవత్సరాలు అవుతుందని ఈ 68 సంవత్సరాల ప్రయాణం లో ఎన్నో విజయాలు సాధించుకున్నాం ఇంకా సాధించాల్సి నవి ఉన్నాయని 1957 లో ధర్మాభిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం దొరలను భూస్వాములను ఎదిరించి హర్రాజు, మామ్లా లను రద్దు చేయించుకుని సొసైటీలను ఏర్పాటు చేసుకొని చెట్టుపై హక్కు ఎక్సగ్రె‌షియా పెన్షన్ లాంటి అనేక హక్కులను సాధించుకున్నామని అన్నారు. అనేకమంది నాయకులు ధర్మ బిక్షం ఎస్ ఆర్ దాట్ల మల్లయ్య తొట్ల మలుసూరు లాంటి అనేకమంది అమరవీరుల స్ఫూర్తితో కల్లు గీత కార్మిక సంఘం దీక్షతో పని చేస్తుందని అలాంటి సంఘం జిల్లా రాష్ట్ర మహాసభలు నవంబర్ 11 న కామారెడ్డి జిల్లా మహాసభ ఉంటుందని ఈ మహాసభ ను జయప్రదం చేయాలని నవంబర్ 28 ,29,30 తేది ల్లో రాష్ట్ర మహాసభలు సూర్యాపేట లో ఉంటాయని రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహా సభలో కల్లు గీత వృత్తి రక్షణకై 3 సంవత్సరాలు కాలంలో ఎలాంటి పోరాటాలు నిర్వహించాలని తిర్మాణాలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల పక్షాన నికరంగా నిలబడి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. వృత్తి రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తుందని ఈ పోరాటాల్లో యువత కల్లు గీత కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ప్రభుత్వం వృత్తిలో ఆధునీకరణ చేపట్టి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు.కేరళ రాష్ట్రం లో కల్లుగీత వృత్తి మీద ఆధునికరణ చేసి లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుందని కల్లగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా అధునికరణ చేపట్టాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ నాయకులు యాదగిరి గౌడ్, నర్సింహులు గౌడ్ దత్తా గౌడ్ వేణు గౌడ్,రామ గౌడ్ యాదగిరి గౌడ్,లక్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Akhand Bhoomi News

error: Content is protected !!