ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 29 (అఖండ భూమి న్యూస్);
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
పారిశుద్ధ్య పనుల తీరు పరిశీలన
మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల తీరు పై ఆరా
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
వర్షాల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో రాజంపేట పారిశుద్ధ్య పనుల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
మురుగు నీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా చూడాలని, చెత్తను సమయానికి తరలించడంతో పాటు, శానిటేషన్ వర్కర్లు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని సూచించారు.
“వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత కలిగినదని అధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించారు
అనంతరం రాజంపేట లో లబ్దిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించి, మాట్లాడుతూ
నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ,త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, మార్కావూట్ అయిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకొని వంద శాతం మార్కావూట్ పనులు పూర్తి చేయాలని, బేస్ మెంట్, రూఫ్ , స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పరిశీలిస్తూ లబ్ధిదారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను ప్రోత్సహించి, త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు.
తదుపరి సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం భూమిపూజ లో పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో సమావేశమై, ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇంకా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసిన పక్షంలో వారికి కూడా శాంక్షన్ మంజూరు చేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు తలెత్తితే ఐకెపి ద్వారా మహిళా సంఘాల ద్వారా బ్యాంక్ రుణాలు ఇప్పించి లబ్దిదారులకు సహయ సహకారాలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మదన్మోహన్ , పి.డి. హౌసింగ్ శ్రీ జైపాల్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. రాజేందర్ రెడ్డి , డిప్యూటీ తహశీల్దార్, ఆర్.ఐలు, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


