ముఖ్యమంత్రిని కలిసిన ఆజరుద్దీన్….

ముఖ్యమంత్రిని కలిసిన ఆజరుద్దీన్….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 30 (అఖండ భూమి న్యూస్);

(అఖండభూమి న్యూస్):

మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మహమ్మద్ అజారుద్దీన్ ను మైనార్టీ కోటాలో రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోనునందున అజహరుద్దీన్ తో పాటు మైనార్టీలు ముఖ్యమంత్రిని కలిసి, మైనార్టీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మైనార్టీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిన అనంతరం మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మైనార్టీలకు సముచిత స్థానం కల్పించేందుకే ఆజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నామని చెప్పారు. మైనార్టీ ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అజహారుద్దీన్, ఫహీం, ఖురేషి, మైనార్టీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు….

Akhand Bhoomi News

error: Content is protected !!