భీమవరం అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలకు కూడా పాత జిల్లాలతో సమానంగా ఇంటి అద్దె బత్యంను 12% నుండి 16% పెంచడంపై హర్షిస్తూ సోమవారం రాష్ట్ర ఎన్జీవో ఉపాధ్యక్షులు పెనుమరెడ్డి శ్రీనివాసులు,జిల్లా ఎన్జీవో నాయకులు వి శోభన్ కుమార్, కె వి ఎస్ కె రమేష్ రెడ్డి, ఎన్ జగదీశ్వర రాజు, ఎం సత్యనారాయణ స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతిని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసే వారి సంతోషాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రభుత్వం అనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని మన ద్వారానే ప్రజలకు చేరుకావాలన్నారు. జిల్లా విభజన తొలినాళ్లలో ఉన్న పరిస్థితులను అధిగమించుకుంటూ మీ సహకారంతో జిల్లాను నేటికీ ఒక రూపం తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులు జిల్లా అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలతతో ఉండటంతో పాటు మీరు కోరిన విధంగా ఆర్థిక ఆర్థికపరమైన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్జీవో నాయకులకు గుర్తు చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



