జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని అన్ని ప్రాథమిక కేంద్రంలోనూ, అన్ని అర్బన్ ఆరోగ్య కేంద్రంలోనూ నిర్వహిస్తాం
-నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం
– ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ డి ఆశ
భీమవరం భూమి, అఖండ భూమి వెబ్ న్యూస్ :
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ డి ఆశ , జిల్లా మలేరియా అధికారి పి ఎస్ ప్రసాదులు పేర్కొన్నారు. సోమవారం ఏలూరులో ఏర్పాటుచేసిన విలేకరి సమావేశంలో వారు మాట్లాడుతూ
రేపు జరగబోయే జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని అన్ని ప్రాథమిక కేంద్రంలోనూ, అన్ని అర్బన్ ఆరోగ్య కేంద్రంలోనూ నిర్వహించాలని వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నానలని ఆదేశించారు. అలాగే గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం వచ్చిన డెంగ్యూ కేసుల అధికంగా నమోదైన ప్రదేశాలలో డెంగ్యూ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన జిల్లాలో చింతలపూడి,చాటపర్రు, పెదవేగి, పెదపాడు, భీమడోలు, ద్వారక తిరుమల మండలాల్లో మరియు ఏలూరు పరిసర ప్రాంతాలలో అధిక సంఖ్యలో డెంగ్యూ కేసు నమోదు అవుతున్నాయని ఆ ప్రదేశంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వ్యాపింప చేయు ఈ డి ఐ ఎస్ హెచ్ (EDISH) దోమ కాటు నుండి ప్రజలు రక్షించుకోవాల్సిందిగా కోరడమైనది ఈ దోమ గృహాలు, గృహ పరిసరాల్లో మంచి నీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వ ప్రాంతాల లైన ని లతొట్టులు,డ్రమ్ములు, ప్లాస్టిక్ పాత్రలు,రుబ్బురోలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ఫ్లవర్ వాజులు,ఫ్రిడ్జ్ వెనుక బాక్స్ నీరు నిల్వ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలని వారానికి ఒకసారి పరిశుభ్రపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఇతర శాఖలైనా మున్సిపల్ శాఖ పంచాయత్ రాజ్ శాఖ విద్యాశాఖ సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖ సహకారం కావాలని అధికారులను కోరడమైనది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె. గోవిందరావు, పి శ్రీనివాసరావు, సభ్ యూనిట్ అధికారి బి నాగేశ్వరరావు, డి ఎం ఎం హెచ్ వో సీసీ బి బసవరాజు, హెల్త్ అసిస్టెంట్స్ రమేష్,,శ్రీనివాస్, వెంకటేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు



