విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.

జిల్లా విద్యాశాఖ అధికారి రాజు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల అంతర్ పాఠశాలల క్రీడా సంబరాలు జెడ్పీహెచ్ఎస్ మాచారెడ్డి పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ. “విద్య మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలి అని తెలిపారు.
ఈ క్రీడా ఉత్సవాలలో అండర్–14 బాలురు, బాలికలు, అండర్–17 బాలురు, బాలికల విభాగాలలో మొత్తం 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే అండర్–11 విభాగంలో బాలురు, బాలికలుగా కలిపి 18 జట్లు పాల్గొన్నాయి.
100 మీటర్ల పరుగులు, షాట్‌పుట్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో ఉత్కంఠభరిత పోటీలు నిర్వహించబడ్డాయి.
కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్ , మండల విద్యాధికారి సురభి దేవేందర్ రావు , వీడియో కన్వీనర్ సుంకు, జి. వెంకటాచారి , ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయలక్ష్మి , వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చంద్రశేఖర్ రెడ్డి…


