ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
టి.టి.యు.” డిమాండ్*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
*రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టి.టి.యు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.డి. ముజిబొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాండ్రె శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
*రాష్ట్రంలో ఒకటి నుంచి పది మంది విద్యార్థుల వరకు ఉన్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలకు మొదటి విడత 50 శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ను విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు.*
*నిధులను విడుదల చేసినట్టు ఉత్తర్వులను విడుదల చేసినప్పటికీ పాఠశాలల ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదని తెలిపారు.
ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వెంటనే స్పందించి స్కూల్ గ్రాంట్ ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు..


