ఉమ్మడి జిల్లా విలువిద్య పోటీలను ప్రారంభించిన అర్చరి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ గౌడ్..!

దోమకొండ కోటలో ఉత్సాహంగా ప్రారంభమైన ఆశ్చర్య పోటీలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 7 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి స్థాయి విలువిద్య పోటీలను కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట మైదానంలో శుక్రవారం అర్చరి అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలోని వివిధ మండలాలకు చెందిన విలువిద్యలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
విలువిద్య పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఇద్దరికి పతకాలు…
దోమకొండకు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. మహబూబాబాద్ లో నిర్వహించిన విలువిద్య రికర్వు రౌండ్ పోటీల్లో బి. ఇందు అండర్-17 విభాగంలో సిల్వర్ మెడల్, బి. వర్షిణి అండర్-14 విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించిన వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వీరిద్దరూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా వీరిని శిక్షకుడు ప్రతాప్ దాసుని అభినందించారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ప్రతాప్ దాస్, జిల్లా అర్చరి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, దోమకొండ సింగిల్ విండో చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి, నాయకులు అండెం శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, చెప్పాల రవి, బట్టి రాములు ,కమ్మరి గంగాధర్ వివిధ అకాడమీకి చెందిన కోచర్లు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


