*ఘనంగా “వందే మాతరం” 150వ వార్షికోత్సవ వేడుకలు…

• వందే మాతరం గీతం – భారతీయుల హృదయాల్లో దేశభక్తి రగిలించిన ఉద్యమ నినాదం..
• భారత జాతి బానిసత్వ విముక్తి ప్రజల చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన వందే మాతరం గీతం..
*• జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నేతృత్వంలో సిబ్బందితో వందే మాతరం గీతం ఆలాపన..
కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నేతృత్వంలో “వందే మాతరం” జాతీయ గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఆఫీసుల సిబ్బంది అందరితో కలిసి ఘనంగా నిర్వహించబడ్డాయి.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ:
వందే మాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించే ఉద్యమ నినాదం అయి, ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిందని అన్నారు. భారత మాత పట్ల భక్తి, త్యాగం , దేశాభిమానానికి ఇది ప్రతీక. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి, ఐక్యత , జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయి అని అన్నారు. జాతీయ గీతం పట్ల గౌరవభావాన్ని పెంపొందించడంలో, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. తెలిపారు.
ఈ వేడుకలో జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్‌ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది , డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


