కామారెడ్డి జిల్లా ఐ డి ఓ సి లో వందేమాతరం గేయం…
![]()
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 7 (అఖండ భూమి న్యూస్);
వందేమాతరం 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత బంకిం చంద్ర చటర్జీ ఈ కీర్తి గీతాన్ని రచించిన సందర్భంగా, భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం భాగంగా కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ (ఐ డి ఓ సి) ప్రాంగణంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు.
ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



