మానవాళికి కొత్త రూపం నేర్పిన అక్టోబర్ విప్లవంతో వినూత్న మార్పు..!
ప్రపంచ చరిత్రను కొత్త దిశలో నడిపించి, దోపిడి పీడనా లేని సమా సమాజం సాధ్యమేనని చాటింది..
జార్ చక్రవర్తి పై విజయం సాధించిన మహా పోరాటమది..
నెరవేరిన శాంతి, అందరికీ భూమి, ఆహారం హామీలు..
సోషలిస్టు వ్యవస్థ వైపు అమెరికా ప్రజల మొగ్గు..
అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనా సోషలిస్టు వ్యవస్థ..
అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో బిజెపి విధానాలపై ఉద్యమించాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; నవంబర్ 09 (అఖండ భూమి న్యూస్);
ప్రపంచ శాంతి, అందరికీ భూమి, ఆహారం హామీలను నెరవేర్చిన సోవియట్ యూనియన్ అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకువచ్చింది. ప్రపంచ చరిత్రను కొత్త దిశలో నడిపించింది. దోపిడీ, పీటనలు లేని సమాజం సాధ్యమేనని ప్రపంచానికి చూపెట్టిన మాత్ర పోరాటం అది. అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని నవంబర్ 7న జరుపుకోవడానికి గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రధాన కారణం. లెనిన్ నేతృత్వంలోని బోల్సివిక్ పార్టీ, బూర్జువాళ్లు కలిసి రష్యాలో జార్ చక్రవర్తుల పాలనను కూడదోసి ఫిబ్రవరి 17న ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఆశించిన విధంగా యుద్ధాల నుండి విముక్తి, రైతులకు భూమి, అందరికీ ఆహార భద్రత అందించేందుకు బూర్జువాలు సిద్ధంగా లేకపోవడంతో ప్రజల సహకారంతో అక్టోబర్ విప్లవం ద్వారా లెనిన్ నాయకత్వంలో రహస్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం జిద్దాల నుండి శాంతి కలిగించి, పేదలకు భూములను పంచింది. అందరికీ ఆహార భద్రత, సంక్షేమం అందించి, సమసమాజ నిర్మాణం ద్వారా జరిగే లాభాలను ప్రపంచానికి చాటిచెప్పింది. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు అప్పజెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పాలన సాగడంతో లెనిన్ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ప్రజలలో పెరిగింది. ఓవైపు రష్యా జాతర మధ్య ఐక్యత కోసం సిద్ధాంతాన్ని రూపొందించడంతోనే అనంతరం సోవియట్ రష్యాగా ఏర్పాటు చేశారు. అదే సమయంలో జర్మనీతో వ్యూహాత్మక సంధి చేసుకుంది. 70 సంవత్సరాల పాటు రష్యా సోషలిస్టు ప్రభుత్వం ప్రపంచానికి ప్రత్యమ్నయ పాలన అందించి, సోవియట్ ఫలాలను ప్రపంచానికి చాటి చెప్పింది. 70 ఏళ్లలో అనేక దేశాల నేతలు సోషలిస్ట్ భావజాలం వైపు మొగ్గుచూపుతున్నారనేది ఇటీవల జరిగిన అనేక పరిణామాలు మనకు చూపించాయి. అనంతర కాలంలో వచ్చిన పాలకులు తీసుకున్న విధానాలతో 1989, 90 సోషలిస్టు వ్యవస్థ కూలిపోయింది. దీంతో కమ్యూనిస్టుల పని అయిపోయిందని పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ ప్రజల సంక్షేమం ఉందని ప్రచారాన్ని కొన్ని శక్తులు అదేపనిగా చేపట్టాయి. సిద్ధాంతాన్ని అమలు చేయడంలో నాయకుల నిర్ణయాలు సరిగా లేకపోవచ్చు కానీ ఎప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతం అత్యుత్తమమైనది. ఒక దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం, సోషలిస్టు వ్యవస్థ నిర్మించడం వేరువేరు అంశాలు. ఉత్పత్తి విధానంలో మార్పు, ఆర్థిక విధానాలు, ఉద్యోగాల కల్పన, మహిళలకు సమాన అవకాశాలు వంటి అంశాలలో మార్పులు రాకుండా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన సోషలిస్టు వ్యవస్థగా మారిందని చెప్పలేము. పేదరి కాలనీ నిర్మూలించి, సంపద సృష్టించి, రోగైన సంపదను ప్రజలకు పంచినప్పుడే ప్రజలలో కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాస నియత పెరుగుతుంది. ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ పని అయిపోయిందన్న పెట్టుబడి దేశాలు సంతోషపడుతున్న సమయంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్టు వ్యవస్థ నేడు ప్రపంచం ముందుకు బలంగా వచ్చి, నిలబడి, తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి, అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది. పేదరిక నిర్మూలన, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనల్లో చైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. పెట్టుబడిదారు దేశమైన అమెరికాకు గుండెకాయ లాంటి ఆర్థిక రాజధాని నియాకులో సోషలిస్టు బాబాజాలం ఉన్న జోహ్రాన్ మమ్ దాని అధికారంలోకి రావడం శుభ పరిణామం. అమెరికా ప్రజలు కూడా సోషలిస్టు వైపు మొగ్గు చూపుతున్నారనేది ఈ విజయం ద్వారా చెప్పకనే చెప్పినట్టుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మాక్సిజం ప్రభావం పెరుగుతున్న తీరును ఎవరు కాదనలేరు. కడు పేదరికంని నిర్మూలించడంలోనూ కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం విజయం సాధించడం మనందరికీ తెలిసిందే. రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం వచ్చాక మహిళలకు, పురుషులకు సమాన పని హక్కులు కల్పించబడ్డాయి. పేదరిక నిర్మూలన జరిగింది, ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలను ఏర్పాటుచేసి, ఉద్యోగాలు కల్పించింది. రాజ్యపాలన నుండి మతాన్ని వేరు చేసింది, చర్చి నుండి పాఠశాలలను దూరం చేసింది. మన దేశంలో మాత్రం నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ పొలంలో మతాన్ని జోప్పిస్తూ, విద్య రంగంలోకి ఆర్ఎస్ఎస్ చొరబడింది. అక్టోబర్ విప్లవ స్మృతితో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సన్నద్ధం చేయడమే కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి.


