కోకో పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైన రామసముద్రం పాఠశాల విద్యార్థి

కోకో పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైన రామసముద్రం పాఠశాల విద్యార్థి

 

పీడీ బాలు నాయక్ విద్యార్థి డి అశోక్ రెడ్డి

పుల్లల చెరువు అఖండ భూమి నవంబర్ 18 న్యూస్

త్రిపురాంతకం మండలం రామసముద్రం లో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాల విద్యార్థి ఎస్ జి ఎఫ్ 69వ గేమ్స్ ఆటల పోటీల్లో మార్కాపురంలో డివిజనల్ లెవెల్ లో డి అశోక్ రెడ్డి జిల్లా లెవల్ కు సెలక్ట్ అయినట్టు రామసముద్రం జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ రమేష్ బాబు తెలిపారు. జిల్లా లెవెల్క సెలెక్ట్ అయిన డి అశోక్ రెడ్డి స్టేట్ లెవెల్ కి వెళ్లి ఆడతారని పిడి. బాలునాయక్ తెలిపారు. డి.అశోక్ రెడ్డి పిడి బాలు నాయక్ చెప్పిన విధంగా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జిల్లా స్థాయికి ఎంపికైనట్టు డి అశోక్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకోవడానికి అనేక రకాలైన వృత్తి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, ఇవి వారి ఆసక్తులు, నైపుణ్యాలు మరియు విద్యా నేపథ్యంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, సైన్స్, కామర్స్ మరియు ఆర్ట్స్ వంటి వివిధ విభాగాల విద్యార్థులకు ప్రత్యేకమైన కెరీర్ మార్గాలు ఉన్నాయి. అని ఆయన అన్నారు.అలాగే పిడి .బాలు నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల వృత్తి అంటే విద్యార్థులు చదువు తర్వాత లేదా చదువుకునే సమయంలోనే ఏదైనా ఒక ప్రత్యేక వృత్తిలో నైపుణ్యం సంపాదించడం. ఇది సాంప్రదాయ విద్యతో పాటు, ఒక నిర్దిష్ట ఉద్యోగం లేదా వృత్తికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. విద్యార్థుల వృత్తి నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు ఉపాధి అవకాశాలను పెంచుతాయి మరియు వారు స్వయం ఉపాధి పొందడానికి సహాయపడతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ రమేష్ బాబు, పిడి బాలు నాయక్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!