స్ట్రినిధి ద్వారా రుణ సహాయం, ఎలక్ట్రిక్ ఆటోల బైకులు లబ్ధిదారులకు అందించిన కలెక్టర్…

స్ట్రినిధి ద్వారా రుణ సహాయం, ఎలక్ట్రిక్ ఆటోల బైకులు లబ్ధిదారులకు అందించిన కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);

 

స్త్రీనిధి ద్వారా ఋణ సహాయం – ఎలక్ట్రిక్ ఆటోలు, బైకులు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం అందించారు.

 

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఆవరణలో స్త్రీ నిధి ద్వారా ఋణ సహాయం కింద ఎలక్ట్రికల్ ఆటోలు, బైకులను జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ లబ్దిదారులకు పంపిణీ చేశారు .

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో కొనసాగుతున్న అత్యున్నత సహకార క్రెడిట్ సొసైటీ, జిల్లాలోని మహిళా స్వయం సహాయక బృందాలకు (SHGs) రుణాలను అందిస్తూ, పేదరిక నిర్మూలనలో ముఖ్యపాత్ర పోసిస్తోందన్నారు .

సహకార సంఘాల కింద నమోదైన స్త్రీనిధి, బ్యాంకింగ్ రంగంలోని క్రెడిట్ ను సమర్థంగా భర్తీ చేస్తూ, మహిళల జీవనోపాధి అభివృద్ధికి వివిధ ఆదాయ కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు అందిస్తోందన్నారు .

ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని కామారెడ్డి, లింగంపేట్, రాజంపేట, దోమకొండ, బిక్నూర్ మండలాలకు చెందిన మొత్తం 11 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల స్త్రీనిధి బ్యాంకు ఆర్థిక సహకారంతో 2 ఎలక్ట్రిక్ ఆటోలు, 9 ఎలక్ట్రిక్ బైకులు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన సాధనలో స్త్రీ నిధి బ్యాంకు అందిస్తున్న ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తోందని

ఈ వాహనాల పంపిణీ తో గ్రామీణమహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వారిలో ఆర్థిక స్థిరత్వం సాధనకు మరింత ప్రోత్సాహం లభించనుందన్నారు .

ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి , స్త్రీనిధి జే డి యం రవికుమార్ , స్త్రీనిధి ఆర్ ఎం కిరణ్ , అలాగే డిపిఎంలు, ఏటీఎంలు, సిసిలు, వివో ఏ ఎస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!