మహిళ మండల సమైక్య ఐకెపి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ:. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22: (అఖండ భూమి న్యూస్ ) ;
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మహిళ సమాఖ్య ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఐకెపి ఏపిఎం శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ” ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహిళల సంక్షేమతో పాటు ఆర్థిక ఉన్నత కలిగించే కార్యక్రమంలో చేపట్టడం ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తూ రాజకీయాల్లోని మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించడం కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారే పెట్టి గౌరవించాలన్న తపనతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలన్న నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. దోమకొండలో 807సంఘాలు, 8420 సభ్యులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐరన్ నరసయ్య డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మాజీ కో ఆప్షన్స్ సభ్యులు షమ్మీ, ఆడేపు శంకర్ రెడ్డి, సీసీలు శ్రీనివాస్ కృష్ణా రామకృష్ణ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


