కొత్త తరహాలో మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా ప్రయత్నం –భగ్నం చేసిన మద్నూర్ పోలీసులు…

కొత్త తరహాలో మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా ప్రయత్నం –భగ్నం చేసిన మద్నూర్ పోలీసులు…

టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణాకు ఆటకం కలగకుండా కార్లతో పైలటింగ్..

*• ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 టిప్పర్స్ & 2 పైలటింగ్ కార్లు స్వాధీనం..

6 గురిపై కేసు నమోదు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);

కొత్త పద్ధతిలో పైలట్ కార్ల సహాయంతో ముందుగా ఉంటూ పోలీస్ చెక్‌పోస్టులను దాటించి మహారాష్ట్రకు ఇసుకను టిప్పర్ ల ద్వారా అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. పక్కా సమాచారంతో ముందస్తు నిఘా ఏర్పాటు చేసిన మద్నూర్ పోలీసులు, నిన్న రాత్రి ప్రత్యేక తనిఖీలలో రెండు టిప్పర్లు , వాటి మార్గాన్ని క్లియర్ చేయడానికి వెళ్తున్న రెండు పైలట్ కార్లను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలలో టిప్పర్లలో ఇసుక ఉన్నట్లు ధృవీకరించబడింది. పరిశీలనలో, ఈ ఇసుక పోతంగల్ గ్రామం, నిజామాబాద్ ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు, ప్రజాధనం దూర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో 2 టిప్పర్లు, 2 కార్లు స్వాధీనం చేసుకోబడ్డాయి. టిప్పర్ డ్రైవర్లు ఇద్దరు, పైలట్ కార్లలో ఉన్న నలుగురు—మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించబడింది.

*నిందితుల వివరాలు*

1. కుంబర్ ఉమాకాంత్, S/o రాజ్‌కుమార్, వయస్సు: 33 సంవత్సరాలు, డిగ్గి గ్రామం, ఔరాద్ మండలం, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు; వాహనం నం. TS-12-యు ఈ-4009

2. మస్కాలే శివాజీ, S/o సుందర్‌రాజ్, వయస్సు: 35 సంవత్సరాలు, ఓల్డ్ గంజ్, ఔరాద్ గ్రామం & మండలం, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు; వాహనం నం. TS-07-టి -6804 డ్రైవర్.

పై ఇద్దరూ టిప్పర్ల డ్రైవర్లు.

3. బుట్టే రాజ్‌కుమార్, S/o బసవరాజ్, వయస్సు: 41 సంవత్సరాలు, నివాసం: బుట్టే గల్లి, ఔరాద్, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.

4. అలపాటి రవి, S/o కృష్ణ, వయస్సు: 37 సంవత్సరాలు, వృత్తి: విజయ లక్ష్మి ట్రాన్స్‌పోర్ట్, రాయచూర్; నివాసం: బిర్లా దేవాలయ కాలనీ, హైదరాబాదు.

5. పవర్ చందర్, S/o భీమ్‌రావు, వయస్సు: 35 సంవత్సరాలు, నివాసం: మహాదోంగావ్ గ్రామం, ఔరాద్ మండలం, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.

6. అప్పాజీ, S/o సూర్యరావు, వయస్సు: 40 సంవత్సరాలు, నివాసం: బిర్లా దేవాలయ కాలనీ, హైదరాబాదు.

పై నలుగురు వ్యక్తులు అక్రమ రవాణా నిర్వహించు పైలటింగ్ కార్ల యజమానులు ఉన్నారని అన్నారు.

 

 

 

 

 

 

Akhand Bhoomi News

error: Content is protected !!