కల్లు అక్రమ రవాణా కేసులో – ఇద్దరికీ ఒక్కోకరికి 5,000 రూపాయల జరిమానా విధింపు

– మద్నూర్ పోలీసుల దర్యాప్తుతో కల్లు అక్రమ రవాణా కేసు రుజువు.
– జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర వెల్లడి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 24. (అఖండ భూమి న్యూస్);
విశ్వసనీయ సమాచారం మేరకు వారం రోజుల క్రితం ఎం హెచ్ 26 టి 8149 నంబరు గల ఆటోలో ఇద్దరు వ్యక్తులు సలాబత్‌పూర్ నుండి దెగ్లూర్ వైపు అనుమతి లేకుండా కల్లు ప్యాకెట్లను రవాణా చేస్తున్నారని తెలిసి, మద్నూర్ ఎస్ హెచ్ ఓ , సిబ్బంది వెంటనే సలాబత్‌పూర్‌లోని తుల్జాహి మెకానిక్ షెడ్ వద్ద ఆటోను ఆపి తనిఖీ చేయగా, గన్నీ బ్యాగుల్లో పదులుగా కల్లు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిని విచారణ జరిపి, అమ్మకం లేదా నిల్వకు అవసరమైన చెల్లుబాటు అయ్యే అనుమతులు ఏవీ చూపించలేకపోవడంతో మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో సూమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరిశోధనలో భాగంగా గ్రామస్తులను విచారించి A-1: ఆటో డ్రైవర్ బందర్వార్ మొగులాజీ తండ్రి, హుల్లాజీ, దెగ్లూర్, A-2: నిమ్మాళ్వార్ సంజయ్ తండ్రి, హన్మంత్ రావు, దెగ్లూర్, వీరిని నేరస్తులుగా గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.
ఇట్టి విషయములో నిందితులపై కోర్టులో అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని బిచ్కుంద జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె. వినీల్ కుమార్ నిందితులకు ఒక్కోకరికి 5,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది.
పోలీస్ తరఫున వాదన వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ గౌడ్, ఈ కేసును సరియైన పద్ధతిలో విచారణ చేసిన మద్నూర్ ఎస్‌హెచ్‌ఓ యం. కాశీనాథ్, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ విజయ్ కొండ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, సీడీఓ కె. ఓంకార్ గార్లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.


