ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే రాజ్యాంగ దినోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ
రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని సూచించారు.
అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.
భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక
సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పొందాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిందన్నారు.
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ,
అంతస్తుల్లోనూ,
అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;,
వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26 వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనం గా రూపొందించుకున్న
ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అన్నారు.
అని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు .
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


