*రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవ కార్యదర్శి నాగరాణి అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 11 వ రాజ్యాంగ దినోత్సవాన్ని సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవ కార్యదర్శి మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ దార్శనిక దృష్టితో భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత భావిభారత పౌరులుగా మనందరిపై ఉందని ఆమె తెలిపారు. రాజ్యాంగ అవగాహన కొరకు నిర్వహించిన పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ అన్నారు. విద్య ద్వారానే రాజ్యాంగ విలువ పెంపొందుతుందని డాక్టర్ అంజయ్య బందెల విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా. సల్ల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కిషన్, ప్రొఫెసర్ కనకయ్య, డా. మోహన్ బాబు, డా. హరిత, డా. లలిత, డా. నాగరాజు, డా. ప్రతిజ్ఞ, డా. నారాయణ, వైశాలి, డా.పోతన, డా. శ్రీను కేతవత్, డా. ఆఫ్రిన్ బేగం, వెంకట్ రెడ్డి, డా మహిపాల్ యాదవ్, డా. సునీల్ కుమార్, శ్రీకాంత్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


