4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి..

4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి..

*3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి..

*కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 26 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని , రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని కామారెడ్డి జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేశారు. . ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ. బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల కిందికి తీసుకొచ్చి దేశంలో ఉన్న కార్మిక రంగాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటందుకు ప్రయత్నిస్తుందని ఈ కోడ్లు కార్మిక వర్గానికి సమ్మెకు కనీస వేతన చట్టం మరియు పనిగంటలు గ్రాటివిటీ ఈపీఎఫ్ పీఎఫ్ వంటి హక్కులను రాకుండా నిర్వీర్యం చేస్తుందని కోడ్ (2019) పారిశ్రామిక సంబంధాల ,(2020)కోడ్ సామాజిక భద్రత( 2020 )కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ (2020) లు 2020లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల అమల్లోకి వస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించడాన్ని అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలొ సిఐటియు నాయకులు ముధం అరుణ్ కుమార్, రైతు సంఘం నాయకులు మోహన్ పటేల్, దశరథ్ ,స్వామి ,శీను, కృష్ణంరాజు, గంగారాం ,సాగర్, ఈశ్వర్ ,సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!