*సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం* …

*కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామెంట్స్..
కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది.
జిల్లాల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మొదటి విడతలో కామారెడ్డి డివిషన్, రెండవ విడతలో ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిషన్, మూడవ విడతలో బాన్సువాడ మిగతా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల రోజునే పలితాలు విడుదల చేస్తారు.
జిల్లాలో ఎన్నికలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము.
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి పిర్యాదులు ఉంటే 9948712421 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఎన్నికల నియమావళి సమయంలో 50 వేలకు మించి నగదు తీసుకుని వెళ్ళరాదు.
అభ్యర్థుల పిల్లల విషయంలో ఎలాంటి షరతులు లేవు.
ప్రతి మండల కేంద్రం నుండి పోలింగ్ సామాగ్రి గ్రామాలకు పంపడం జరుగుతుంది.
*ఎస్పీ రాజేష్ చంద్ర కామెంట్స్* :
ఎన్నికలకు పోలీస్ శాఖ నుండి అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం.
ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుండి నియమావళి మొదలవుతుంది.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం.
జిల్లాలో ఉన్న చెక్ పోస్టులతో పాటు అదనంగా మరి కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం.
జిల్లాలో అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించరాదు.
సోషల్ మీడియాలో ఏమైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం.
50 వేలకు మించి నగదు తీసుకుని వెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు వెంట తీసుకెళ్లాలి.


