విద్యార్ధులకు నోట్ బుక్స్ అందించిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవార్ పేట్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఆవరణలో ఎక్కడా చెత్త కనిపించకుండా శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు.
పదవ తరగతి క్లాస్‌రూమ్ కి వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో పరస్పర సంభాషణ జరిపిన కలెక్టర్ పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, టీచర్లు అందిస్తున్న మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు.
విద్యార్థుల విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపరచడానికి వారికి నోట్‌బుక్స్ ను స్వయంగా విద్యార్ధులకు అందించి,పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
తదుపరి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ తమకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి? ఎందుకు ఇష్టం? అని అడిగి, విద్యార్ధులు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. ఆ సబ్జెక్ట్ గురించి విద్యార్థుల మాటల్లో వచ్చిన వివరాలను విని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అధ్యయన ఆసక్తిని అభినందించి ప్రతీ విద్యార్థికి నోట్‌బుక్స్ ను స్వయంగా అందజేశారు.
మెనూ ప్రకారం భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్బందీగా నిర్వహించాలని, ఫలితాలు మెరుగుపడేల కృషి చేయాలని తెలిపారు.
తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు , తహసిల్దార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


