తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో కొత్త విధానం..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
_తెలంగాణలో ఈసారి పదో తరగతి పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి పరీక్షకు కనీసం ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండు–మూడు రకాల షెడ్యూళ్లను రూపొందిస్తూ ఉన్నందున అధికారిక తేదీల ప్రకటన ఆలస్యమైంది. వరుస పరీక్షలు ఉండటం వల్ల ప్రతిభావంతుల సహా చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, సిద్ధం చేసుకునేందుకు సమయం కొరతగా మారుతోందని పేర్కొంటున్నారు. ఈ కారణంగా సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం ఇచ్చే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీబీఎస్‌ఈ పరీక్షల్లో రెండు నుంచి ఏడు రోజుల గ్యాప్ ఉన్నట్లే, తెలంగాణ టెన్త్ పరీక్షలకు కూడా కనీస విరామం ఇవ్వడం ద్వారా విద్యార్థులు మెరుగ్గా సిద్ధం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అధికారిక టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది._
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


