గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకస్మిక పరిశీలన – స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకస్మిక పరిశీలన

– స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు


– జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27. (అఖండ భూమి న్యూస్);

గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, పోసానిపేట్ గ్రామపంచాయతీలు మరియు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారెడ్డి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ మరియు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర,శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.
పరిశీలన సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి,ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరుగేలా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ఎన్నికలలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.” అని స్పష్టం చేశారు.
జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఆకస్మిక పరిశీలనలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, సంబంధిత ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!