పరిద్ పీట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవోల్ల రాములు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట్ సర్పంచ్ అభ్యర్థిగా గురువారం దేవోల్ల రాములు నామినేషన్ దాఖలు చేశారు. తన సామాజిక వర్గంతో పాటు గ్రామస్తుల మద్దతుతో పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ సమీపం కు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా ఒక నామినేషన్ దాఖలు చేయగా శుక్రవారం రోజు మరో రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఫరీద్ పెట్ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రథమ స్థాయిలో గ్రామపంచాయతీ అయిన ఫరీద్ పెట్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికై మోడల్ గ్రామపంచాయతీగా మార్చి అభివృద్ధిలో ముందు ఉంచడమే లక్ష్యంగా సర్పంచ్ ఎన్నికల్లో భారీ లోకి దిగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోనే మోడల్ గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో తన మద్దతు దారులతోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


