వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం, సోమవారం పేట్ గ్రామ పంచాయితీ పరిధి లోని నెమలి గుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రంలో వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాలు, నిల్వ సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ , లోడింగ్ వంటి అంశాలను సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
రైతుల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకొని, వెంటనే పరిష్కారం కోసం సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
తనిఖీలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఎమ్ శ్రీకాంత్, తహసిల్దార్ సరళ, ఎంపీడీవో శ్రీనివాస్,సిబ్బంది తదితరులు పాల్గొన్నా
రు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


