అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు బాలింతలకు బలమైన పౌష్టికాహారం…

 

నియోజవర్గంలో అన్ని ప్రాంతాలకు పక్క సీసీ రోడ్లు

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

భీమవరం, మే 16 అఖండ భూమి వెబ్ న్యూస్ :

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడి కేంద్రాల రూపురేఖలను మార్చి బలమైన పౌష్టికాహారాన్ని అందించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక మెనూ తయారుచేసి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాయలం గ్రామంలో రూ 14 లక్షల 40 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగనవాడి బిల్డింగును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు బలమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ సొంత భవనాలలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగానే రాయలం గ్రామంలో అంగన్వాడి కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు.

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి..

రాయలం గ్రామంలో 41 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటర్నల్ సిసి రోడ్లను ఎమ్మెల్యే గ్రంధి శీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 41 లక్షల రూపాయలతో

మానుకొండ సూరయ్య ఇంటి నుండి ఉన్నమట్ల పాండు ఇంటి వరకు, జల్లి రామచక్రం ఇంటి నుండి చాబత్తుల శామ్యూల్ ఇంటి వరకు, డి గోపాల్ రావు ఇంటి నుండి కొక్కిరిగడ్డ సంజీవరావు ఇంటి వరకు ఇంటర్నల్ సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు ఈ రోడ్లను నిర్మించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నామని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోరిక మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముందుగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైసిపి నాయకులు చినమిల్లి శ్రీనివాస్, చిన మిల్లి నాగన్న, చినమిల్లి వెంకటరాయుడు, చెల్లబోయిన బుజ్జి, కండిబోయిన గిరి , కండిబోయిన వాసు, పస్తుల రాంబాబు, ప్రదీప్, క్రిస్టఫర్, చిన మిల్లి తాతాజీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!