లివింగ్ వాటర్ సంస్థ ఆధ్వర్యంలో మంచినీటి బోరు 950 అడుగుల లోతు వేయించారు

ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ యాదిద్యా
యర్రగొండపాలెం అఖండ భూమి.
యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెంగ్రామంలో గిరిజనులు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయాన్ని లివింగ్ వాటర్ సంస్థ వారిని కోరగా,వెంటనే స్పందించి యర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరిడిండెంట్ డాక్టర్ దేవర యదిధ్యా ప్రోత్సాహంతో లివింగ్ వాటర్ సంస్థ ఆధ్వర్యంలో మల్లాపాలెం గ్రామంలో పాస్టర్ కృపాకర్ చర్చి ఆవరణలో శనివారం మంచినీటి బోరు నిర్మాణం చేపట్టారు. 950 అడుగులులోతు వరకు బోరు వేయించారు. మంచినీరు పుష్కలంగా వచ్చాయి.ఈ సందర్భంగా లివింగ్ వాటర్ సంస్థ డైరెక్టర్ సామ్యేలు డేవిడ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కువగా పేదలు ఉన్నట్లు చెప్పారు. బోరు వేయించిన లివింగ్ వాటర్ సంస్థ డైరెక్టర్ సామ్యేలు డేవిడ్ కు గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపతిపల్లి సర్పంచ్ మున్నంగి లాజర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


