దోమకొండ గ్రామ అభివృద్ధి చేయడమే.. నా లక్ష్యం..!
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 1 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ గ్రామ అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తానని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ అన్నారు. సోమవారం ఇంటింటా ప్రచారంలో భాగంగా గ్రామంలో డోర్ టు డోర్ తీరుగుతూ ఈ సందర్భంగా మాట్లాడారు. దోమకొండ అభివృద్ధి వెనుకబాటును తొలగించి గ్రామాన్ని పట్టణంతో సమానంగా తీర్చిదిద్దుతానని అన్నారు. దోమకొండ గ్రామపంచాయతీలో ఎలాంటి అవినీతి జరగకుండా అవినీతి లేని పంచాయితీ పాలన అందిస్తానని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య పాలన అందిస్తానని అన్నారు. దోమకొండ ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని దోమకొండ ప్రజలను వేడుకున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధిలో దోమకొండను ప్రథమ స్థానంలో ఉంచుతానని ఇంటింటా ప్రజలను వేడుకున్నారు. దోమకొండలో పెరుగుతున్న జనాభా ఆధారంగా వారి వసతులు సౌకర్యాలతో పాటు అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. కనీస సౌకర్యాలు అయిన విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాలువల పరిశుభ్రత, వీధిలైట్ల తో పాటు జనాభా ఆధారంగా గ్రామానికి కావలసిన మెరుగైన సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. ఒక్కసారి నమ్మి అవకాశం ఇవ్వండి దోమకొండను పంచాయతీ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని మరోసారి దోమకొండ ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తన మద్దతుదారులతో పాటు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


