ఓటు ఎవరికైనా వేయండి, వేసేముందు గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించండి….

ఓటు ఎవరికైనా వేయండి, వేసేముందు గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించండి….

చైతన్యంతో ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం మన బాధ్యత….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 1. (అఖండభూమి న్యూస్):;

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మూడు విడుదల లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) తేదీలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ఎన్నికల సందడి ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. రెండో దశ నామినేషన్ మొదలు అయింది.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి, ప్రజలకు సేవ గుణం మీ గ్రామాల పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఉందా అనేది మనందరం ఆలోచించాలి. గ్రామ నిధులను పారదర్శకంగా వినియోగించి, వ్యక్తిగత ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనానికి సర్పంచ్ మగ్గు చూపాలి. ఎవరైనా గ్రామస్తులు సమస్యలతో తమ వద్దకు వచ్చినప్పుడు, ఓపికగా వినే గుణం కలిగి ఉండాలి. గ్రామ ప్రజలందరికీ నిరంతరం చేరువలో, అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలి. రాజకీయాలు, పార్టీ, వర్గం చూడకుండా అందర్నీ సమానంగా చూసే గుణం అభ్యర్థులలో ఉండాలి. గ్రామంలో శాంతి, ఐక్యమత్యం కాపాడేందుకు సర్పంచ్ నిరంతరం ప్రయత్నం చేసే వ్యక్తి కావాలి. విద్యుత్తు, పరిపాలన పై అవగాహన కలిగి ఉండి, ప్రభుత్వ పథకాలపై అవగాహనతో గ్రామ అభివృద్ధి, ప్రణాళికలను రూపొందించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. ధైర్యం, నిర్ణయ సామర్థ్యం కలిగిన వ్యక్తి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామ సమస్యలకు త్వరగా నిర్ణయం తీసుకొని, పరిష్కారం చూపే వ్యక్తి గ్రామ సర్పంచుగా ఎన్నిక కావాలి. రోడ్లు, నీరు, విద్యుత్తు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు, యువత కోసం అవకాశాలు వంటి అంశాల్లో అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థిని ఎన్నుకోవాలి. గ్రామ సభలను నిర్వహించే ఆర్థిక వివరాలను ప్రజలకు చెప్పి, ఎవరు ఏమి అడిగినా నిజాయితీగా సమాధానం చెప్పే ఓపిక ఉన్న అభ్యర్థి సర్పంచుగా అర్హులు. అక్రమార్కులను ఎన్నుకుంటే గ్రామానికి అసలుకే మోసం వస్తుంది. అవినీతి లేని సర్పంచ్ ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను ప్రోత్సహించి, అభివృద్ధిలో పాలుపంచుకునేలా చైతన్యవంతం చేసి, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం కలిగి ఉండాలి. కేసులు, గొడవలు, వాదోపవాదాల్లో మధ్యవర్తిగా ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచేందుకు నిరంతరం కృషి చేయాలి. బాధితుడు, గ్రామస్తులు, ఏదైనా సమస్య నిమిత్తం సర్పంచి దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగించేందుకు ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులలో అర్హులను ఎన్నుకొని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని అఖండ భూమి న్యూస్ ప్రజలను కోరుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!