ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. దోమకొండ సమస్యలను పరిష్కరిస్తా..!
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, సమస్య పరిష్కారంతోపాటు దోమకొండను ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ అన్నారు. దోమకొండ గ్రామంలో ఇంటింటా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి దోమకొండ గ్రామ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలోనే అతిపెద్దదైన దోమకొండ మేజర్ పంచాయతీ అత్యధిక ఓటరులు ,జనాభా కలిగిన గ్రామంగానే ఉందని అన్నారు. దోమకొండ గ్రామపంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి కి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దోమకొండ గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు ప్రభుత్వ ఐటిఐ కళాశాల వచ్చే విధంగా సహకరిస్తారని అన్నారు. గ్రామంలో మెరుగైన రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామంలో సరిపడా నీటి సౌకర్యాలు కల్పించడం, త్రాగునీరు సమస్య లేకుండా వాటర్ ట్యాంకుల ప్రక్షాళన, నీటి కుళాయిలను ఏర్పాటు చేయడం, అన్ని వీధులలో పట్టణాలకు తక్కువ కాకుండా నాణ్యమైన, మెరుగైన రోడ్లు నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని అన్నారు. గ్రామాన్ని కామారెడ్డి జిల్లాలోనే నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోవడం ఎంతో అవసరమని అన్నారు. గ్రామ అభివృద్ధితోపాటు పెరుగుతున్న జనాభా సరిపడా అభివృద్ధి పనులను చేపట్టి, పట్టణాలకు తక్కువ కాకుండా దోమకొండను అభివృద్ధిలో పరుగులు తీయిస్తారని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా దోమకొండ ఓటర్లను వేడుకున్నారు. ఎలాంటి అవినీతి లేకుండా దోమకొండ గ్రామపంచాయతీని ఆదర్శవంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు. దోమకొండ లో ఎంతోమందికి అవకాశం ఇచ్చారని ఒక్కసారి దోమకొండ సర్పంచిగా గెలిపించి చూడండి అభివృద్ధిలో అద్భుతం సృష్టిస్తున్న అని ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్దతు దారులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


