ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థి గర్దాస్ శేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ సర్పంచిగా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గరిదాస్ శేఖర్ దోమకొండ పట్టణంలో ఉదయాన్నే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దోమకొండ లో ప్రచారంలో భాగంగా ఆయన ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ. గత పాలకులు దోమకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్న పాలకులు మాత్రం దోమకొండ పట్టణాన్ని పట్టించుకోలేదని తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధిలో దోమకొండను జిల్లాలో అభివృద్ధి దిశగా తీర్చి దిద్దుతానని అన్నారు.తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని సీనియర్ జర్నలిస్ట్ గర్దాస్ శేఖర్ అన్నారు. గతంలో దోమకొండ వీడిసి ఉపాధ్యక్షుడిగా దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వార్డు సభ్యునిగా దోమకొండ ప్రభుత్వ కాలేజీ అధ్యక్షులుగా పనిచేశానని ఆయన అన్నారు ప్రజా సమస్యలపై అవినీతి లేకుండా న్యాయబద్ధంగా పరిష్కారానికి కృషి చేస్తానని శేఖర్ తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు శేఖర్ కు దోమకొండ పలు కుల సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారనీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


