శబరిమల అయ్యప్ప క్షేత్రానికి 15 రోజుల్లో రూ.92 కోట్లు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్లు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన రూ.69 కోట్లతో పోలిస్తే ఆదాయం 33.33 శాతం పెరిగింది. అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల ద్వారా రూ.47 కోట్లు సమకూరాయి. హుండీ ఆదాయం 18.18 శాతం పెరిగింది. నవంబరు 30 వరకు సుమారు 13లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిను దర్శించుకున్నట్లు టీడీబీ తెలిపింది.


