ప్రచారంలో దూకుడు పెంచిన దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..!

ప్రచారంలో దూకుడు పెంచిన దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..!

దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..

టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 4 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా పున్న లక్ష్మణ్ తమ అమూల్యమైన ఓటును టూత్ పేస్ట్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దూకుడు పెంచారు. దోమకొండ లోని ప్రతి ఇంట డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని తన మద్దతు దారులతో హోరెత్తించారు. దోమకొండ గ్రామం అభివృద్ధి కావాలన్నా, దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాల తో పాటు అన్ని హంగులతో దోమకొండ మేజర్ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని దోమకొండ ప్రజలను, ఓటర్లను ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. దోమకొండలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాలువల నిర్మాణం, మంచినీటి సౌకర్యాలు, త్రాగునీరు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. దోమకొండలో పట్టణాలకు తీసుకోకుండా పెరుగుతున్న జనాభా ఆధారంగా అన్ని వసతుల, సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ దోమకొండను మోడల్ గ్రామంలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. దోమకొండను అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేస్తానని ఆయన ప్రజలను వేడుకున్నారు. ఇప్పటికీ ఎంతోమందికి సర్పంచులుగా అవకాశమిచ్చారని, ఒక్కసారి సర్పంచ్ గా గెలిపిస్తే అవినీతి లేని గ్రామ పంచాయతీ పాలన ప్రజల కోరిక మేరకు కొనసాగిస్తానని అన్నారు. అవినీతి లేని దోమకొండ గా జిల్లాలో పేరు తీసుకురావడమే కాకుండా డివిజనల్ స్థాయికి దోమకొండను తీసుకపోవడమే లక్ష్యంగా పనిచేస్తానని మరోసారి ప్రజలను వేడుకున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచి అభ్యర్థి పున్న లక్ష్మణ్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!