ప్రచారంలో ముందంజ దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్…

ప్రచారంలో ముందంజ దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్…

దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్నా లక్ష్మణ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 5 (అఖండ భూమి న్యూస్);

 

దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ ప్రచారంలో దూసుకుపోయి ముందంజలో ఉన్నారు. శుక్రవారం దోమకొండలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్నారు. దోమకొండను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా పున్న లక్ష్మన్ అనే నాకు టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. దోమకొండ పాత తాలూకా కేంద్రమైనప్పటికీ సమస్యల వలయంలోనే ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అవినీతి రహిత సమాజం కోసం, అవినీతి లేని గ్రామ పంచాయతీగా నూతన పాలన అందించేందుకు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని దోమకొండ ప్రజలను వేడుకున్నారు. దోమకొండ లో పాత తాలూకా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల, ఐటిఐ కళాశాలతో పాటు దోమకొండ డివిజన్ గా, అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన అసెంబ్లీ స్థానాల్లో దోమకొండ నియోజకవర్గం గా ఏర్పాటు చేసి దోమకొండను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. డివిజనల్ స్థాయిలో అన్ని కార్యాలయాలకు అనువైన స్థలాలను కేటాయించడంతోపాటు దోమకొండ 50 పడకల ఆసుపత్రి మంజూరైనప్పటికీ స్థల సేకరణలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమకొండలో అనువైన స్థలం ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజల సౌకర్యాల కోసం అభివృద్ధిలో దూసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. దోమకొండ లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాల నిమిత్తం త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, నూతన డ్రైనేజీ వ్యవస్థను, నూతన మినీ ట్యాంకర్ కుళాయిలను బస్తీల లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. దోమకొండ లో ఇకనుండి ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులను, ప్రజల అభీష్టం మేరకే పనులు జరిగే విధంగా ఉంటాయని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, దోమకొండ ను జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. గ్రామపంచాయతీ లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని అన్నారు. దోమకొండ ప్రజలు ఎంతో మందికి సర్పంచ్ గా అవకాశం ఇచ్చారని, నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!