ప్రచారంలో ముందంజ ముత్యంపేట్ సర్పంచ్ అభ్యర్థి గున్నాల రజిత- రామా గౌడ్ …

ముత్యంపేట్ సర్పంచ్ గున్నాల రజిత – రామా గౌడ్ అభ్యర్థి ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 6 (అఖండ భూమి న్యూస్);
ముత్యంపేట్ సర్పంచ్ అభ్యర్థి గున్నాల రజిత -రామా గౌడ్ శనివారం ప్రచారంలో దూసుకుపోయి ముందంజలో ఉన్నారు. ముత్యంపేట్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్నారు. ముత్యంపేట్ ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా గున్నాల రజిత -రామా గౌడ్ అనే నాకు లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ముత్యంపేట్ సమస్యల వలయంలోనే ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అవినీతి రహిత సమాజం కోసం, అవినీతి లేని గ్రామ పంచాయతీగా నూతన పాలన అందించేందుకు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ముత్యంపేట్ ప్రజలను వేడుకున్నారు. ముత్యంపేట్ లో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలతో పాటు అన్ని కార్యాలయాలకు అనువైన స్థలాలను కేటాయించడంతోపాటు ముత్యంపేట్ కు కాకుండా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ముత్యంపేటలో అనువైన స్థలం ఏర్పాటు డ్వాక్రా సంఘానికి భవన నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణం, ప్రజల సౌకర్యాల కోసం అభివృద్ధిలో దూసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ముత్యంపేట్ లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాల నిమిత్తం త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, నూతన డ్రైనేజీ వ్యవస్థను, నూతన మినీ ట్యాంకర్ కుళాయిలను బస్తీల లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇకనుండి ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులను, ప్రజల అభీష్టం మేరకే పనులు జరిగే విధంగా ఉంటాయని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, దోమకొండ ను జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. గ్రామపంచాయతీ లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని అన్నారు. ముత్యంపేట్ ప్రజలు ఎంతో మందికి అవకాశం ఇచ్చారని, నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ సర్పంచ్ అభ్యర్థి గుండాల రజిత, రామా గౌడ్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


