ప్రచారంలో దూసుకుపోతున్న దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..!
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..
టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 6 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ గ్రామ సర్పంచిగా ఎన్నికల బరిలో నిలిచిన పున్న లక్ష్మణ్ ప్రచారంలో దుమ్ము రేపుతూ తగ్గేదేలే అంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను వేడుకున్నారు. శనివారం దోమకొండ గ్రామంలో తన మద్దతు దారులతో 12 బృందాలుగా ఏర్పాటు చేసుకొని అన్ని కాలనీలలో ప్రచారంలో దుమ్ము రేపుతూ దూసుకుపోతున్నారు. దోమకొండ లోని 16 వార్డులలో ప్రచారంలో కలి తిరుగుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పలు బీడీ కంపెనీలతోపాటు దుకాణ సముదాయాలను, 16 వార్డులలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి గ్రామంలో హోరెత్తించారు. దోమకొండను అభివృద్ధి పథంలో నడిపించాలంటే అవినీతి లేని పంచాయతీ పాలన అందించడమే ధ్యేయంగా తన ప్రణాళికతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దోమకొండ పంచాయతీ లో ఇకనుండి గ్రామంలోనిఎలాంటి పనులైన ఇండ్ల నిర్మాణాలు ఇలాంటి కమిషన్ లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రసీదులు తీసుకొని ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. స్థలాలు, భూములు, ఇండ్లు , ఓనర్ షిప్ (యాజమాన్య హక్కు పత్రం) పేద, మధ్యతరగతి, అన్ని వర్గాల ప్రజలకు ఇలాంటి అక్రమాలు లంచాలు లేకుండా అవినీతి రహిత పాలన అందిస్తానని అన్నారు. దోమకొండ గ్రామపంచాయతీకి అవినీతి రహిత పంచాయితీగా ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆయన ఓటర్లను వేడుకున్నారు. దోమకొండలో 50 పడకల ఆసుపత్రి మంజూరైనప్పటికి స్థలం కేటాయించడంలో నిర్మాణం జరగకుండా పెండింగ్ లోనే ఉందని గుర్తు చేశారు. సర్పంచ్ గా విజయం సాధిస్తే అనువైన స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దోమకొండ ను అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడంలో కృషి చేస్తానని, దోమకొండను డివిజనల్ కేంద్రంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. దోమకొండ పాత తాలూకా సబ్ డివిజనల్ పరిధిలోని తరలిపోయిన సబ్ ట్రెజరీ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి దోమకొండలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని అన్నారు. దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ ఐటిఐ కళాశాల , డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, మూర్తి కాల్వల నిర్మాణం, మినీ వాటర్ ట్యాంకులను కాలనీలలో ఏర్పాటు చేయడం, అన్ని కాలనీలలో సిమెంటు రోడ్లు వేయించడం, స్ట్రీట్ లైట్స్ వ్యవస్థను పట్టణాలకు తక్కువ కాకుండా దోమకొండలో ఏర్పాటు చేయడం, పెరుగుతున్న జనాభా ఆధారంగా దోమకొండలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తన ప్రణాళికతో ముందుండి ఊటల ఆశీస్సులతో విజయం సాధిస్తే దోమకొండను మోడల్ పంచాయతీగా ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రతి ఓటరు ఎంతోమందికి సర్పంచులుగా అందరికీ అవకాశం ఇచ్చారని, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను ఇంటింటా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ అభ్యర్థి ఉన్న లక్ష్మణ్ తో పాటు తన మద్దతుదారులు పాల్గొన్నారు.
You may also like
నూతన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు,సన్మానం టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
దోమకొండ, అంబారీ పేట్, పరిధిపేట్ గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం…
ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…
సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు..!
23, 27 తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..?


