ప్రచారంలో ముందంజ జనగామ సర్పంచ్ అభ్యర్థి మట్ట శ్రీనివాస్ …
జనగామ సర్పంచ్ అభ్యర్థి మట్ట శ్రీనివాస్ ..
బ్యాట్ గుర్తుకే మన ఓటు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 6 (అఖండ భూమి న్యూస్);
జనగామ సర్పంచ్ అభ్యర్థి మట్ట శ్రీనివాస్ ఆదివారం ప్రచారంలో దూసుకుపోయి ముందంజలో ఉన్నారు. జనగామ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్నారు. జనగామను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి జనగామ సర్పంచ్ అభ్యర్థిగా మట్ట శ్రీనివాస్ అనే నాకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. జనగామ లో సమస్యల వలయంలోనే ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అవినీతి రహిత సమాజం కోసం, అవినీతి లేని గ్రామ పంచాయతీగా నూతన పాలన అందించేందుకు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జనగామ ప్రజలను వేడుకున్నారు. జనగామ లో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులతో జనగామ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. జనగామలో అనువైన స్థలం ఏర్పాటు డ్వాక్రా సంఘానికి భవన నిర్మాణం, ఇతర ప్రభుత్వ భవన కార్యాలయాల నిర్మాణం, ప్రజల సౌకర్యాల కోసం అభివృద్ధిలో దూసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. జనగామలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాల నిమిత్తం త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, నూతన డ్రైనేజీ వ్యవస్థను, నూతన మినీ ట్యాంకర్ కుళాయిలను బస్తీల లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇకనుండి ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులను, ప్రజల అభీష్టం మేరకే పనులు జరిగే విధంగా ఉంటాయని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, జనగామ గ్రామం ను జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. గ్రామపంచాయతీ లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని అన్నారు. జనగామ ప్రజలు అవకాశం ఇచ్చారని, నాకు మరోసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ సర్పంచ్ అభ్యర్థి మట్ట శ్రీనివాస్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


