జోరందుకున్న ప్రచారం.. హోరెత్తీస్తున్నా దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్

జోరందుకున్న ప్రచారం.. హోరెత్తీస్తున్నా దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్

దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..

టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 7 (అఖండ భూమి న్యూస్);

 

దోమకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం జోరు అందుకొని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ టూత్ పేస్ట్ గుర్తుకే ఓటు వేయాలని ఎన్నికల్లో హోరెత్తించారు. దోమకొండలో 16 వార్డులలో 16 బృందాలుగా ఏర్పడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళ ఓటరులతో పాటు దోమకొండ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి లేని పాలన, అవినీతి లేని గ్రామపంచాయతీగా నిలవాలంటే ఒక్కసారి దోమకొండ సర్పంచిగా పున్న లక్ష్మణ అనే నాకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. దోమకొండను ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేయాలంటే, ప్రజలు ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. రేపటి తరానికి రేపటి తరానికి, పెరుగుతున్న జనాభా ప్రకారం దోమకొండలో మరిన్ని సౌకర్యాలు, అభివృద్ధి దిశగా కొనసాగాలంటే ఒక్కసారి టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ తో పాటు తమ మద్దతుదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!