ప్రచారంలో జోరు.. తగ్గేదేలే అంటు కలే తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..!

టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి ఉన్న లక్ష్మణ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 8 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రచారంలో కొనసాగిస్తూ తగ్గేదేలే అంటు సోమవారం ప్రచారంలో దూసుకుపోతున్న దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న్ లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం స్పీడ్ కొనసాగించారు. దోమకొండ సర్పంచ్ గా గతంలో ఎంతోమందికి అవకాశమిచ్చారని దోమకొండ భవిష్యత్తు యువతరం కోసం అవినీతి లేని పంచాయతీ పాలన అందించడం కోసం ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం దోమకొండ ప్రజలు ఇవ్వాలని విన్నపించారు. ఇంటింటికి పున్న లక్ష్మణ్ తన ఎన్నికలలో టూత్ పేస్ట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్ గా గెలిపిస్తే దోమకొండ పంచాయతీలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలు మెచ్చే, గ్రామ ప్రజల అంగీకారం మేరకు పాలనను అందిస్తానని అన్నారు. దోమకొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కొత్తగా ఎన్నికల్లో పాల్గొన్న నాకు అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అందించాలని అన్నారు. దోమకొండను మోడల్ గ్రామంగా ఏర్పాటు చేయడమే లక్ష్యమని అన్నారు. అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధి, మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు, ఐటిఐ కళాశాల, దోమకొండ డివిజన్ గా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయడం, పెరుగుతున్న దోమకొండ జనాభా ఆధారంగా వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడమే అన్నారు. దోమకొండ పాట తాలూకా కేంద్రమైన దోమకొండను అసెంబ్లీ నియోజకవర్గం గా 2029 లో కేంద్ర ప్రభుత్వం చేయడానికి పరిశీలిస్తుందని అన్నారు. నీతివంతమైన పాలన కోసం అవినీతి లేని సర్పంచ్ని ఎన్నుకోవాల్సిన అవసరం దోమకొండ గ్రామ ప్రజలపై ఉందని అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


