పంచాయితీ స్థాయిలోనే సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది

పంచాయితీ స్థాయిలోనే సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 12,( అఖండ భూమి న్యూస్);

గ్రామపంచాయతీల లో సమర్థవంతమైన పాలనతో రాష్ట్ర అభివృద్ధి దిశగా అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో షబ్బీర్ అలీకిభారీ ర్యాలీగా స్వాగతం పలికిన నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు

ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులను అభినందిస్తూ శుక్రవారంకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘాన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనీ భారీ ర్యాలీ ఇందిరా గాంధీ చౌరస్తా నుండి కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంది.

కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచులను పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన షబ్బీర్ అలీ మాట్లాడుతూ

గ్రామస్థులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలి. పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది,” అని అన్నారు.

నూతన సర్పంచులు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ శుభ్రమైన పాలన పారదర్శకత, గ్రామ అవసరాల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళా సంఘాలు, యువత మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!