అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు సంక్షేమ పథకాలపై అవగాహన

అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు సంక్షేమ పథకాలపై అవగాహన

యర్రగొండపాలెం,డిసెంబర్12 ( అఖండ భూమి)

ఐటిడిఎ శ్రీశైలం ప్రాజెక్టు అధికారి వెంకట శివ ప్రసాద్ సూచనలతో, అసిస్ట్ ప్రాజెక్ట్ ప్రధాన అధికారి విష్ణు ప్రియ అదేశాల మేరకు పట్టణంలోని స్థానిక ఎంపిడివో కార్యాలయంలో మండల స్థాయిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక యన్జివో సంస్థల సమన్వయ ౦తో అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మండలం లోని చెంచు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా అమ లవుతున్న సంక్షేమ పథకాలపై అవగాహనా కార్య క్రమం నిర్వహించారు. అసిస్ట్ సంస్థ ఏరియా కోఆర్డి నటర్ ఏ.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావే శంలో తహసిల్దార్ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ చెం చు గూడేలలో అసిస్ట్ సంస్థ ద్వారా ఆధార్ కార్డుల సర్వీ సులు,నూతన రేషన్ కార్డులు,ఉపాధి హామీ పని గుర్తిం పు కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చడం, బ్యాంకు ఖాతాలు, ఓటు కార్డు, పుట్టిన తేదీ పాత్రలు, మరణ దృవీకరణ పత్రాలు వంటి సేవలు అంది స్తుందని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అసిస్ట్ సిబ్బంది ద్వారా అందిస్తున్న సేవలను ఉపయోగిం చుకొని పథకాలను పొందాలని అన్నా రు. ఈకార్యక్రమంలో ఆర్హెడ్స్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏ కరుణాకర్, మేనేజర్ మహాలక్ష్మి, ఏటిడబ్ల్యువో వెంకటేశ్వర్లు, అంగన్వాడి సూపర్ వైజర్ సుజాత, గంజివారిపల్లె సర్పంచ్ సుబ్బారెడ్డి, అసిస్ట్ యర్రగొండపాలెం ఫీల్డ్ కోఆర్డినేటర్ దారా వెంక టరావు, యన్. హనుమంతరావు,కమ్యూనిటీ ఆర్గనైజర్స్. కామ్లా నాయక్, బాల లక్ష్మీబాయి, వెంకటశం, లక్ష్మీబాయి, విటీడీఏ సభ్యులు, ప్రభుత్వ అధికారు లు, వెలుగు సీసీ కాశయ్య, ఎన్జీవోల సభ్యులు,22 చెంచు గూడెంల చెంచు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!