సర్పంచ్ అభ్యర్థులను సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 12 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని శుక్రవారం భారీ ర్యాలీగా నూతనంగా ఎన్నికైన పార్టీ సర్పంచులు స్వాగతం పలికారు.
ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘాన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనీ భారీ ర్యాలీ ఇందిరా గాంధీ చౌరస్తా నుండి కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకొన్నారు.
కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచులను పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
గ్రామస్థులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలి. పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది,” అని అన్నారు.
నూతన సర్పంచులు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ శుభ్రమైన పాలన పారదర్శకత, గ్రామ అవసరాల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళా సంఘాలు, యువత మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


