బెల్లంపల్లి సాయి భక్తులచే షిర్డీలో పల్లకి సేవ*

బెల్లంపల్లి సాయి భక్తులచే షిర్డీలో పల్లకి సేవ

బెల్లంపల్లి డిసెంబర్ 11(అఖండ భూమి న్యూస్)మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బుదకూర్డు ఏరియాలోని మహమ్మద్ ఇస్మాయిల్ గారిచే నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ సాయి సేవకులు షిర్డీ లో ఈరోజు పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా బాబా సేవకులు మాట్లాడుతూ..బెల్లంపల్లి సాయిబాబా ఆలయం నుండి ఇప్పటి వరకు 16 సార్లు షిర్డీ లో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించమన్నారు.అలాగే బెల్లంపల్లి,భూపాలపల్లి,జమ్మికుంట,ఉస్నాబాద్,మచిలీపట్లం,బెంగళూరు నుండి సాయి మహిళా భక్తులు సుమారుగా సుమారుగా 200 నుండి 300 వందల వరకు భక్తులు పాల్గొన్నరన్నారు.షిర్డీలోని పల్కి నివార్ నుండి బాబావారి పల్లకి కార్యక్రమం మొదలువ్వాగా భక్తులు అట పాటల తో నృత్యలు చేస్తూ సుమారుగా 5 కిలోమీటర్లు బాబావారి పల్లకి సేవ నిర్వహించడం జరిగిందన్నారు.కండోభ మందిరం చేరుకొని అక్కడినుండి బాబావారి ఆలయ ప్రాంగణంలో బాబావారికి పుష్పాలు జల్లుతు బాబా మందిరం చేరుకున్నామన్నారు.

బాబావారికి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో దత్త జయoతి అనంతరం షిర్డీలో పల్లకి సేవ కార్యక్రమం ఉంటుందని, భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రులు కాగలరానివారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ అవునూరి దుర్గయ్య,సేవకులు ఆకుల కుప్పు స్వామి ఎనగందుల దత్తు,పీక చాణక్య,సట్టల మధునయ్య,కడికాల శివ శంకర్,కిరణ్, గోపి,సాయి రాఘవ్,ఎనగందుల చరణ్,కుంభలా రాజేష్,జంగం సోని,గోపాల్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!