జిల్లాలోనే దోమకొండకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 9 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి ఐరేని నర్సయ్య. దోమకొండ డిసెంబర్ 8 ఆంధ్రప్రభ. తనను దోమకొండ సర్పంచుగా గెలిపిస్తే జిల్లాలోనే దోమకొండకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తానని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి ఐరేని నర్సయ్య అన్నారు. సోమవారం నాడు దోమకొండ పట్టణంలోని పలు వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ తనను సర్పంచ్ గా గెలిపిస్తే జిల్లాలోని దోమకొండకు ప్రత్యేకత తీసుకువచ్చి అనేక నిధులను తెస్తానన్నారు. గ్రామ అభివృద్ధితోపాటు కుల సంఘాల అభివృద్ధి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి తీసుకు వస్తాను అన్నారు. అలాగే బీడీ కార్మికులకు ప్రత్యేక దావకాన ఏర్పాటు చేసి దాని ద్వారా వైద్యం అందించే ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం. మురికి కాల్వ నిర్మాణం. ప్రభుత్వం నుండి అందించే పెన్షన్లను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తారు అన్నారు. పెన్షన్ల కోసం పలుగడ్డ ప్రాంతంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని. గ్రామంలో ఊర పండగ నిర్వహిస్తానని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తానని చెప్పారు. అలాగే విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు.తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఓటరు లకు విజ్ఞప్తి చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


