కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యం. దోమకొండ సర్పంచ్ అభ్యర్థి అండెం శంకర్ రెడ్డి. 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యం. దోమకొండ సర్పంచ్ అభ్యర్థి అండెం శంకర్ రెడ్డి.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 9 (అఖండ భూమి న్యూస్);

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ తరఫున గ్రామము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి అండెం శంకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు గ్రామంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించి ప్రజలుదేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని. మంత్రి సీతక్క. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సహకారంతో దోమకొండ గ్రామాన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని వివరించారు. తనను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించాలని అభ్యర్థించారు. తనకు గత 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నదని తనని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే దోమకొండ కుడిచెరువును మరో ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేసేందుకు నిధులు తెస్తానన్నారు. గ్రామంలో నిరుపేదలైన ఇండ్లు లేని వ్యక్తులకు ప్రత్యేక కోట ద్వారా అధికంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి తెస్తాను అన్నారు. దోమకొండలో ప్రతివాడలో సీసీ రోడ్లు. మురికి కాలువలు నిర్మిస్తానని. పల్గడ్డ ప్రాంతానికి ఒక అదనపు పెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.దోమకొండలో 50 పడుకుల ఆసుపత్రి ఏర్పాటుకు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. శంకర్ రెడ్డి సోమవారం నాడు మహిళలతో పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం నిర్వహించి తనను దీవించాలని అభ్యర్థించారు. ప్రజలు మీయొక్క అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!